On a side note and lighter vein - అర్ధమయిన కొంచెం కూడా ఎంతలా నాటుకుపొయాయంటే, ఈ పైన రిప్లై పెట్టేటప్పుదు గోల్డెన్ ప్రెడిక్షన్ టెక్నిక్ ప్రకారం చూసుకుంటే, నాకు బాధకుడయిన గురువు (moon starlord) లో కలిసిరాని కేతు (lagna starlord)... వెస్టర్న్ ట్రాన్సిట్‌లో బుధుడికి చంద్రుడికి కానీ, బుధుడికి గురువుకి కానీ కోణ / అర్ధకోణ దృష్టులు లేవు.. ఒరిజినల్‌గా ప్రొగ్రెషన్స్ లో మిక్సడ్ రిజల్ట్స్ జరుగుతున్నాయి కానీ, ప్రొగ్రెసివ్ సన్ (ద్విస్వభావ రాశి) నటల్ యురేనస్ (ద్విస్వభావ రాశి) కి అప్రోచింగ్ స్క్వేర్‌లో ఉన్నాడు (అంటే.. ఉన్న నాలెడ్జ్ నాకు వుపయోగపడదు) సన్ తృతీయాధిపతి (ఉపచయ స్థానం) కాబట్టి ఈ స్క్వేర్ మూలాన మనసులో అనుకున్నది సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేకపోవచ్చు (ఇంకా వేరేవి కూడా ఉన్నాయనుకోండి) - ఇన్ని నెగటివ్‌లు చూసుకుని కూడా ఉండబట్టుకోలేక రాసేస్తున్నాను (నాకు పునర్పుదోషం కూడా ఉంది కాబట్టి రాసినదాంట్లో రెండుమూడుసార్లు ఎడిట్ చేసుకొటం..రెండుమూడు సార్లు అడిగితే కానీ జవాబు రాకపోవటం జరుగుతోంది 😊 )