Damodar లగ్న యోగ కారకులు అయినా కాకపోయినా స్వ నక్షత్రంలో వక్రత్వం పని చేయదు.
కానీ స్వ నక్షత్రంలో వక్రించి 30 రోజుల్లో వక్రత్వం వీడక స్వ నక్షత్రంలో కాక వేరే ఒక నక్షత్రం లోకి వెళ్తే దాని ఫలితాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది.
ఉదాహరణకి సింహ లగ్నానికి గురువు విశాఖలో వక్రించి 30 రోజుల్లో ఋజు మార్గాన్ని పొందక స్వాతి నక్షత్రం లో వెనక్కి వెళితే ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.
కానీ ఆ నక్షత్ర అధిపతి అయిన రాహువు ఒకవేళ 2, 10, 11 స్థానాల్లో ఉంటే ఆ వక్రత్వ దోష ఫలితాలు ఉండవు. అయినప్పటికీ కీ గోచారంలో గోచార గురువు వక్రించిన లేక రాహువు వక్రించినగ్రహ నక్షత్రంలో సంచరించిన మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది