కర్కాటక లగ్నానికి గురు పాలితులైన కేతువు+ రవి+ గురుడు కలిసి యుండుట దోషమేమి కాదు. అయితే వీరు ఏమైనా అస్తంగత్వ దోషాన్ని కలిగి ఉన్నారా అనేది చూడాలి, ఒకవేళ అస్తంగత్వం దోషాన్ని కలిగి ఉన్నా కూడా రవి, కేతు మహర్దశ లు యోగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ,ఇది సాంప్రదాయ విధానం . అయితే అంతకంటే ముఖ్యం గా వీరు ఎవరి నక్షత్రంలో ఉన్నారు & ఆ నక్షత్ర నాథుడు యే భావం లో ఉన్నాడు అనేది చూసి మాత్రమే ఫలిత నిర్ణయం చేయాలి.
ఇక సప్తమంలో చంద్రుడు , అందునా లగ్నాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు పాపి అయినటువంటి రాహువుతో కలిసి ఉన్నారు అని అన్నారు లగ్నంలో కేతువు ఉన్నాడు అంటే దానర్థం సప్తమంలో రాహువు ఉన్నాడనే కదా? కాబట్టి దానిని ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. రాహువు తో చంద్రుడు కలిసి ఉండుటవలన దుష్ఫలితాలు ఉంటాయని ఊహించడం అది సాధారణమే.
ఇక్కడ చంద్రుడు హీనుడు అయినప్పటికీ ధనిష్టా నక్షత్రంలో ఉన్నాడు , నక్షత్ర నాధుడైన కుజుడు కర్కాటక లగ్నానికి పంచమ+ రాజ్యాధిపత్యం చేత మిక్కిలి శుభ ఫలితాలు ఇచ్చువాడు . నక్షత్ర నాథుడు అయినటువంటి కుజుడు ఏ భావం లో ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది , మరియు లగ్నంలో ఉన్నటువంటి రవి ,గురుల దృష్టి ఎంత వరకు చంద్రుడు మీదపడుతున్నదనేది కూడా తీసుకోవాలి వీరి దృష్టి కర్కాటక లగ్నానికి మంచిదే కదా?కావునా ఇక్కడ చంద్రుడికి ప్రత్యేకంగా వచ్చినటువంటి దోషం ఏమీ లేదు రాహువుతో కలిసి యుండుట తప్పా? నక్షత్ర నాధుడైన కుజుడు ఏ భావంలో ఉన్నాడో చూసుకొని ఫలితం నిర్ణయించాలి. రాజయోగానికి భంగం కలగ కపోయినా సప్తమంలో చంద్ర- రాహువుల యుతి వైవాహిక విషయంలో ,భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి అనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నది!