KP Horary పరీక్షకు సంబంధించిన ప్రశ్న ఎలా చూడాలి?

Hello namasthe vinod garu horary lo  vyakthi prashna adigina time ki chart vestham .aa chart ni analise chestham. job vasthundha/ ledha anedhi? na doubt vinod gaaru  aa date lo rasina exam lo qualifie avuthundha ani adigithe exam rasina date prakaram emanna chudaalaa?

2 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod(@vinod)
Member
07-02-2023 2:22 pm

నమస్తే శిరీష గారు,
ఉద్యోగం గురించి ఉదాహరణ ఇంతకుముందే మన RVA తెలుగు ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది, 2, 6, 10, 11 భావాలను ఆధారంగా ఉద్యోగాన్ని పరిశీలించవచ్చు,

పరీక్షలు రాసిన తేదీని బట్టి ఫలితాలు నిర్ణయించడం సరైన పద్ధతి కాదు,

పరీక్షల్లో రెండు రకాల పరీక్షలు ఉంటాయి, Competitive exams కి సంబంధించినవి, వార్షిక పరీక్షలు,

Competitive exams కి పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 6, 11 భావాలను కూడా పరిశీలించాలి,

సాధారణ పరీక్షలకి, ప్రాథమిక విద్య అయితే 4, 11 భావాలని,

ఉన్నత విద్య అయితే, 2, 4, 5, 9, 11 భావాలను పరిశీలించి ఫలిత నిర్ణయం చేయవలసి ఉంటుంది.

ఒక ముఖ్య విషయం గమనించాలి, నేను ఒక్క ప్రశ్న జాతకం తోనే పూర్తి విషయాన్ని ఫలితం నిర్ణయం చేయను, జన్మజాతకం ఫలిత నిర్ణయంలో ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది.

దీనికి గల కారణం ప్రశ్నజాతకం అడగడంలోనూ, తీసుకోవడంలోని ఏర్పడే చిక్కులే.

Related Discussions